తెలంగాణ

telangana

ETV Bharat / state

మున్నేరు ఉద్ధృతిని పరిశీలించిన మంత్రి అజయ్​కుమార్​

నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు రాష్ట్రంలోని వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఖమ్మం సమీపంలో మున్నేరు నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. మున్నేరు ఉద్ధృతిని రాష్ట్రమంత్రి అజయ్​కుమార్​ పరిశీలించారు.

minister ajay kumar visit munneru in khammam district
మున్నేరు ఉద్ధృతిని పరిశీలించిన మంత్రి అజయ్​కుమార్​

By

Published : Aug 15, 2020, 8:51 PM IST

గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఖమ్మం సమీపంలో మున్నేరు నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ మున్నేరు నది ఉద్ధృతిని పరిశీలించారు. ఖమ్మం వద్ద మున్నేరు 23 అడుగులకు చేరింది. దీంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసిన అధికారులు.. నది పరివాహక ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత స్థలాలకు చేర్చుతున్నారు.

జిల్లాలో నదులు, వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో ఎటువంటి ప్రాణనష్టం వాటిల్లకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి అజయ్‌కుమార్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మంత్రి వెంట మేయర్‌ పాపాలాల్‌, కలెక్టర్‌ కర్ణన్‌, మున్సిపల్​ కమిషనర్‌ అనురాగ్‌ తదితరులు ఉన్నారు.

ఇవీ చూడండి: ఇవాళ, రేపు భారీ వర్షాలు..19న మరో అల్పపీడనం

ABOUT THE AUTHOR

...view details