వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండాలని కోరుతూ భక్తిశ్రద్ధలతో ఖమ్మం జిల్లా మధిర రైతులు గంగాలమ్మ జాతరను ఘనంగా నిర్వహించారు. మహిళలు అమ్మవారికి నైవేద్యంగా పాయసం తయారు చేసుకొని బోనాలు నెత్తిన పెట్టుకుని పట్టణ వీధుల్లో ప్రదర్శనగా బయలుదేరారు. ముత్యాలమ్మ తల్లి వద్దకు చేరి పూజలు చేశారు. అక్కడి నుంచి గంగాలమ్మ తల్లి ఆలయానికి చేరుకుని అమ్మవారికి నైవేద్యం సమర్పించారు. రైతులు ఎడ్ల బండ్లకు ప్రబలు కట్టుకుని ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు.
మధిరలో ఘనంగా గంగాలమ్మ జాతర
తమ గ్రామానికి ఎలాంటి ఆపద రాకుండా చల్లగ చూడాలని వేడుకుంటూ ఖమ్మం జిల్లా మధిరలో గంగాలమ్మ జాతరను అత్యంత వైభవంగా నిర్వహించారు.
మధిరలో ఘనంగా గంగాలమ్మ జాతర