ఎడతెరిపి లేని వర్షం... రోడ్లన్నీ జలమయం - వర్షం
ఖమ్మం జిల్లా మధిరలో ఈరోజు ఉదయం నుంచి ఎడతెరిపిలేని వర్షం కురుస్తోంది. ఇన్నాళ్లు వరణుడి రాక కోసం ఎదురుచూసిన రైతుల కళ్లలో ఆనందం వెల్లివిరిసింది.
madhira city roads are blocked due to water as there is continues raining from morning
ఈరోజు ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వర్షంతో ఖమ్మం జిల్లా మధిరలో వీధులన్నీ జలమయ్యాయి. ప్రధానంగా ఆర్వీ కాంప్లెక్స్ కూడలి, సుందరయ్య నగర్, వాసవీ థియేటర్ రోడ్డు, అంబేడ్కర్ సెంటర్లో రోడ్లపైకి నీరు చేరి చెరువును తలపిస్తోంది. రహదారులపై నీరు నిలవడం వల్ల రాకపోకలకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటివరకు దాదాపు 22 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ అధికారులు వెల్లడించారు.
- ఇదీ చూడండి : యువతి కిడ్నాప్ జరిగిందా..? తనకు తానే వెళ్లిందా?