కనీస వేతనం 400 ఇవ్వాల్సిందే..!
ఉపాధి హామి కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఖమ్మంలో కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు.
ఉపాధి హామీ కార్మికులు ధర్నా
ఖమ్మంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ఉపాధి హామీ కార్మికులు ధర్నా నిర్వహించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం టెక్నికల్ అసిస్టెంట్లను నియమించి..పనిని కొలిచి డబ్బులు ఇస్తున్నారని ఆ విధానం తొలిగంచాలని డిమాండ్ చేశారు. పట్టణ ప్రాంతంలో ఉపాధి హామీ పనులు నిర్వహించి కనీసం వేతనం 400 ఇవ్వాలని కోరారు. పోడు సాగుదారుల జోలికి వస్తే ఉద్యమం తప్పదని హెచ్చరించారు.