తెలంగాణ

telangana

ETV Bharat / state

'పారిశుద్ధ్య పనులపై నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు' - sanitation enquiry in villages

పారిశుద్ధ్య పనులపై నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఖమ్మం జిల్లా కలెక్టర్​ ఆర్వీ కర్ణన్​ అధికారులను హెచ్చరించారు. ఏన్కూరు మండలంలోని పలు గ్రామాల్లో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. పల్లెప్రగతి పనులు, పారిశుద్ధ్య కార్యక్రమాలను పరిశీలించి... స్థానికులకు పలు సూచనలు చేశారు.

khammam collector rv carnan sudden visit to enkur mandal
'పారిశుద్ధ్య పనులపై నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు'

By

Published : Jun 30, 2020, 5:33 PM IST

ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలంలోని గ్రామాల్లో కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌ ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. నాచారం, రేపల్లెవాడ గ్రామాల్లో ఇటీవల చేపట్టిన పల్లెప్రగతి పనులు, పారిశుద్ధ్య కార్యక్రమాలు పరిశీలించారు. పారిశుద్ధ్యం లోపించిన వీధుల్లో.... వార్డు సభ్యులకు నోటీసులు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.

పలు వీదుల్లో ఇంటింటికి తిరిగి కూలర్లు, పాత టైర్లు, నీటితొట్లు తనిఖీ చేశారు. దోమల నివారణకు ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని, ఆరోగ్య జాగ్రత్తలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పారిశుద్ధ్య పనులపై నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులను కలెక్టర్​ హెచ్చరించారు.

ఇదీ చూడండి:భారత్‌ బయోటెక్‌కు గవర్నర్‌ తమిళిసై అభినందనలు

ABOUT THE AUTHOR

...view details