'మీ పాత్ర లేకపోతే సీబీఐ విచారణ చేపట్టండి'
ఇంటర్ ఫలితాల్లో గందరగోళంపై సమగ్ర విచారణ జరిపించేందుకు కేసును సీబీఐకి అప్పగించాలని సీఎల్పీ నాయకుడు మల్లుభట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. ఖమ్మంలో పార్టీ కార్యాలయం నుంచి కలక్టరెట్ వరకు ర్యాలీ కొనసాగించారు.
ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఆందోళన
ఇంటర్ ఫలితాల్లో గందరగోళంపై ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఆందోళన చెపట్టింది. పార్టీ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ధర్నా చౌక్‌లో ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమంలో సీఎల్పీ నేత భట్టి పాల్గొన్నారు. కొన్ని లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వం ఆడుకుందని ఆరోపించారు. ఈ వ్యవహారంలో ప్రభుత్వ పాత్ర ఏమి లేకపోతే సీబీఐ విచారణకు అనుమతించాలని భట్టి డిమాండ్ చేశారు.