రుతుపవనాల ప్రభావంతో ఖమ్మం జిల్లాలో వానలు కురుస్తున్నాయి. ఈ వర్షాలకు వాగులు, చెరువులు నిండి వరద నీరు పొంగి పొర్లుతూ మున్నేరు వాగులోకి చేరుతోంది. దానవాయిగూడెం చెక్‌డ్యాం పైనుంచి ప్రవహిస్తున్న వరదనీరు మున్నేరు వైపు ప్రవహిస్తోంది.
మున్నేరు వాగుకు పోటెత్తిన వరదనీరు
ఖమ్మం జిల్లాలో గత 24 గంటలుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు వాగులు, చెరువులు నిండిపోతున్నాయి. ఖమ్మం సమీపంలోని మున్నేరు వాగులోకి వరద ప్రవాహం పెరిగింది.
మున్నేరుకు చేరిన వరదనీరు
ఉమ్మడి వరంగల్‌లో కురిసిన వర్షాలకు వాగులు పొంగి.. మున్నేర వాగులోకి భారీగా వరదనీరు వచ్చి చేరింది. చెరువులు నిండి.. మున్నేరు జలకళ సంతరించుకోవడంపై రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చూడండి:విదేశీ యాప్‌లకు ప్రత్యామ్నాయంగా 'ఎలిమెంట్స్'