తెలంగాణ

telangana

ETV Bharat / state

Covid Vaccination: 'వుయ్ గాట్ వ్యాక్సినేటెడ్' అంటూ విద్యార్థుల మానవహార ప్రదర్శన - ts news

Covid Vaccination: ఖమ్మం జిల్లా బి.గంగారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని సాయి స్ఫూర్తి డీఏవీ పాఠశాలలో జిల్లా వైద్యాధికారుల ఆధ్వర్యంలో వ్యాక్సినేషన్​ కార్యక్రమం జరిగింది. మొత్తం 118 మంది విద్యార్థులు కొవాగ్జిన్ టీకాలను వేయించుకున్నారు. విద్యార్థులు టీకా తప్పనిసరిగా వేయించుకోవాలని అవగాహన కల్పిస్తూ, వ్యాక్సినేషన్ ప్రాధాన్యతను తెలియజేసే నమూనాను ప్రదర్శించారు.

Covid Vaccination: 'వుయ్ గాట్ వ్యాక్సినేటెడ్' అంటూ విద్యార్థుల మానవహార ప్రదర్శన
Covid Vaccination: 'వుయ్ గాట్ వ్యాక్సినేటెడ్' అంటూ విద్యార్థుల మానవహార ప్రదర్శన

By

Published : Jan 5, 2022, 7:18 PM IST

Covid Vaccination: ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బి.గంగారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని సాయి స్ఫూర్తి డీఏవీ పాఠశాలలో జిల్లా వైద్యాధికారుల ఆధ్వర్యంలో వ్యాక్సినేషన్​ కార్యక్రమం నిర్వహించారు. 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు 15 నుంచి 18 ఏళ్లు ఉన్న మొత్తం 118 మంది కొవాగ్జిన్ టీకాలను వేయించుకున్నారు.

Covid Vaccination: 'వుయ్ గాట్ వ్యాక్సినేటెడ్' అంటూ విద్యార్థుల మానవహార ప్రదర్శన
వ్యాక్సిన్​ వేయించుకుంటున్న విద్యార్థులు

ఈ సందర్భంగా విద్యార్థులు టీకా తప్పనిసరిగా వేయించుకోవాలని అవగాహన కల్పిస్తూ, వ్యాక్సినేషన్ ప్రాధాన్యతను తెలియజేసే నమూనాను ప్రదర్శించారు. 'వుయ్ గాట్ వ్యాక్సినేటెడ్' , 'గో ఒమిక్రాన్ గో' అంటూ ఉత్సాహంగా నినాదాలు ఇస్తూ మానవహార ప్రదర్శన చేసి, తమ ఆత్మ విశ్వాసాన్ని విద్యార్థులు ప్రకటించారు.

వ్యాక్సిన్​ తీసుకుంటున్న విద్యార్థి

విద్యార్థులు తప్పనిసరిగా టీకా వేయించుకోవాలని, కరోనా విపత్కర పరిస్థితుల్లో టీకా సంజీవని వంటిదని పాఠశాల ప్రధానోపాధ్యాయులు సీహెచ్​ కిరణ్​కుమార్​ పేర్కొన్నారు. టీకా వేయించుకోవడానికి అర్హులైన విద్యార్థులందరికీ అవగాహన కలిగించేందుకు ఈ మానవహార ప్రదర్శన నిర్వహిస్తున్నామని తెలిపారు. సామాజిక చైతన్యం కలిగించే విషయాలను విస్తృతపరచడంలో డీఏవీ విద్యాసంస్థలు ఎప్పుడూ ముందుంటాయని డీఏవీ తెలంగాణ జోన్ రీజినల్ డైరెక్టర్ వీఎన్ఎన్​కే శేషాద్రి తెలిపారు.

వ్యాక్సిన్​ వేయించుకున్న విద్యార్థులను అభినందిస్తూ.. వారి సామాజిక స్పృహను హెటిరో డ్రగ్స్ అధినేత డాక్టర్ బండి పార్థసారథి రెడ్డి, సాయి స్ఫూర్తి డీఏవీ స్కూల్ ఛైర్మన్ దాసరి ప్రభాకర్ రెడ్డి, తదితరులు కొనియాడారు.

వ్యాక్సినే శ్రీరామరక్ష
వ్యాక్సిన్​ కోసం క్యూలో నిల్చున్న విద్యార్థులు

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details