తెలంగాణ

telangana

ETV Bharat / state

ఖమ్మంలో హోలీ సంబురాలపై కరోనా ప్రభావం

హోలీ పండుగపై కరోనా వైరస్​ ప్రభావం చూపింది. పలు పట్టణాల్లో ప్రజలు వేడుకలకు దూరంగా ఉన్నారు. చిన్నపిల్లలు మాత్రమే అక్కడక్కడా హోలీ జరుపుకొన్నారు. ఖమ్మంలోనూ అదే పరిస్థితి నెలకొంది.

CORONA EFFECT ON HOLI CELEBRATIONS IN KHAMMAM
CORONA EFFECT ON HOLI CELEBRATIONS IN KHAMMAM

By

Published : Mar 9, 2020, 1:44 PM IST

ఖమ్మంలో హోలీ వేడుకలపై కరోనా వైరస్ ప్రభావం పడింది. పలువురు నగర వాసులు హోలీ వేడుకలకు దూరంగా ఉండగా మరికొందరు ఉత్సాహంగా జరుపుకొన్నారు. రహదారులన్నీ ఖాళీగా దర్శనమిస్తూ.. పండగ వాతావరణం పెద్దగా కనిపించలేదు.

కొన్ని ప్రదేశాల్లో చిన్నారులు మాత్రం రంగులు పూసుకుంటూ ఉత్సాహంగా హోలీ జరుపుకున్నారు. రంగులు పిచికారీ చేసుకుంటూ కేరింతలు కొట్టారు. ఎంతైనా.. హోలీపైన కరోనా ప్రభావం మాత్రం బాగానే పడిందని చెప్పాలి.

ఖమ్మంలో హోలీ సంబురాలపై కరోనా ప్రభావం

ఇదీ చూడండి:ఎస్​ బ్యాంక్​ వ్యవస్థాపకుడిపై 'మోసం, అవినీతి' కేసులు

ABOUT THE AUTHOR

...view details