అర్హులైనవారందరికీ డబుల్బెడ్రూం ఇళ్లు ఇస్తామన్న ప్రభుత్వం... ఆ తర్వాత పూర్తిగా చేతులెత్తేసిందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. ఖమ్మం నగరంలోని ధంసలాపురం, అల్లీపురం ప్రాంతాల్లో నిర్మిస్తున్న రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణాలను జిల్లా కాంగ్రెస్ నేతలతో కలిసి ఆయన పరిశీలించారు.
అర్హులైనవారందరికీ డబుల్బెడ్రూం ఇళ్లు ఇవ్వాలి: భట్టి
ఎన్నికలొచ్చినప్పుడల్లా తెరాస నేతలు రెండు పడక గదుల ఇళ్ల ఆశ చూపి ఓట్లు దండుకుంటున్నారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. ఖమ్మం నగరంలోని ధంసలాపురం, అల్లీపురం ప్రాంతాల్లో నిర్మిస్తున్న రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణాలను భట్టి పరిశీలించారు.
అర్హులైనవారందరికీ డబుల్బెడ్రూం ఇళ్లు ఇవ్వాలి: భట్టి
ఖమ్మం నగరంలో ఏడాదికి 2 వేల మందికి ఇళ్లు ఇస్తామని చెప్పి.... ఏడేళ్లలో కేవలం 417 మందికి మాత్రమే అందజేశారని పేర్కొన్నారు. నగరంలో ఉన్న పేదలందరికీ గృహాలు మంజూరు చేస్తామని చెప్పిన మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్... హామీని నెరవేర్చాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి:పంటల బీమా.. రైతులకేదీ ధీమా..
Last Updated : Oct 2, 2020, 7:21 AM IST