తెలంగాణ

telangana

ETV Bharat / state

గ్రామాలన్నీ స్వచ్ఛ గ్రామాలుగా మారాలి: ఆర్​.వి.కర్ణన్​ - ఖమ్మం జిల్లా పాలనాధికారి

30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలో భాగంగా జిల్లాలోని అన్ని గ్రామాలను స్వచ్ఛ గ్రామాలుగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని ఖమ్మం జిల్లా పాలనాధికారి ఆర్.వి.కర్ణన్ పేర్కొన్నారు.

గ్రామాలన్నీ స్వచ్ఛ గ్రామాలుగా మారాలి: ఆర్​.వి.కర్ణన్​

By

Published : Sep 22, 2019, 10:49 AM IST

30 రోజుల ప్రణాళికలో భాగంగా ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగం భాగస్వామ్యంతో జిల్లాలోని అన్ని గ్రామాలను స్వచ్ఛ గ్రామాలుగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని ఖమ్మం జిల్లా పాలనాధికారి ఆర్.వి.కర్ణన్ స్పష్టం చేశారు. ప్రణాళిక అమలుపై జిల్లాలోని పలు గ్రామాల్లో ఆయన ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. భవిష్యత్తులో శాశ్వతంగా పల్లెల్లో మార్పు తీసుకురావడానికి 30 రోజుల ప్రణాళిక బాటలు వేస్తుందన్నారు. గ్రామాల్లో పారిశుద్ధ్యం, స్మశానవాటికలు, డంపింగ్ యార్డు నిర్మాణాల పైనే ప్రధానంగా దృష్టి సారిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రతీ నియోజకవర్గంలో ఓ స్వచ్ఛ గ్రామాన్ని ఎంపిక చేసి 25 లక్షల నగదు ప్రోత్సాహకం అందజేస్తామని తెలిపారు.

గ్రామాలన్నీ స్వచ్ఛ గ్రామాలుగా మారాలి: ఆర్​.వి.కర్ణన్​

ABOUT THE AUTHOR

...view details