తెలంగాణ

telangana

ETV Bharat / state

భారమని వదిలేసి.. పేగుబంధం కదిలించి..

ఓ మహిళకు ఇదివరకే ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. ఈ క్రమంలోనే ఆమె మరోసారి గర్భం దాల్చింది. కాన్పు కోసం భర్త ఆమెను ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించాడు. ఈ క్రమంలోనే ఆ మాతృమూర్తి ఆడశిశువుకు జన్మనిచ్చింది. దీంతో ఆ దంపతులిద్దరూ తమకు భారమని భావించి.. ఆ అమ్మాయిని ఆసుపత్రిలోని ఊయలలోనే వదిలేసి ఇంటికెళ్లిపోయారు. కానీ కొద్దిసేపటికే ఆ మహిళకు పేగుబంధం గుర్తుకొచ్చింది. పాపను ఎలాగైనా తీసుకురావాలని భర్తతో చెప్పింది. బిడ్డను తీసుకురావడానికి ఆసుపత్రికి వెళ్లిన అతడికి అధికారులు ట్విస్ట్​ ఇచ్చారు. అదేంటంటే..?

newborn baby
newborn baby

By

Published : Jan 1, 2023, 4:49 PM IST

మూడో సంతానం కూడా అమ్మాయి కావడంతో దంపతులిద్దరూ భారమని భావించారు. శిశువును సర్కారు ఆసుపత్రి ‘ఊయల’లో వదిలేసి ఇంటికెళ్లిపోయారు. కానీ పేగు బంధాన్ని తెంచుకోలేక మనసు మార్చుకుని గంటల వ్యవధిలో ఆమె భర్తను ఆసుపత్రికి పంపింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. సూర్యాపేట జిల్లా మోతె మండలం గోపతండాకు చెందిన ఓ ఆటో డ్రైవర్‌ డిసెంబరు 23న భార్యను కాన్పు కోసం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించాడు.

అదేరోజు వైద్యులు సిజేరియన్‌ చేశారు. ఆడపిల్ల జన్మించడంతో వారు భారమని భావించారు. పుట్టిన శిశువు వద్దనుకునే తల్లిదండ్రుల కోసం ఆసుపత్రిలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఊయలలో బిడ్డను వదిలేసి శనివారం మధ్యాహ్నం ఇంటికెళ్లిపోయారు. గంటల వ్యవధిలోనే తల్లి మనసు మారింది. భర్తను ఆసుపత్రికెళ్లి శిశువును తీసుకురమ్మని చెప్పింది. అతడు ఆసుపత్రికి వెళ్లి ఊయలలో వదిలివెళ్లిన పాప తమ బిడ్డే అని చెప్పాడు.

సీసీ ఫుటేజీని పరిశీలించిన అధికారులు నిజమని ప్రాథమిక అవగాహనకు వచ్చారు. ఈ ఘటనపై అప్పటికే ఛైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీ కేసు నమోదు చేయడంతో శిశువును అప్పగించేందుకు నిబంధనలు అడ్డొచ్చాయి. విచారణ అనంతరం తల్లిదండ్రులకు అప్పగిస్తామని అధికారులు తెలిపారు.

ఇవీ చదవండి:రాజ్​భవన్​లో ఘనంగా న్యూఇయర్​ వేడుకలు

'రాహుల్ నాయకత్వానికి కొత్త ఊపు.. 2024లో అధికార మార్పు పక్కా'

ABOUT THE AUTHOR

...view details