తెలంగాణ

telangana

ETV Bharat / state

"ఈ నెల 17న జరిగే ధర్నాను విజయవంతం చేయండి"

పోలీస్​ శాఖ ఏబీవీపీ కార్యకర్తలను ప్రోత్సహిస్తూ తెలంగాణ విద్యార్థి ఐక్యవేదిక నేతలపై దాడులు చేస్తోందని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మద్దిలేటి ఆరోపించారు. ఈ నెల 17న హైదరాబాద్​లోని ఇందిరాపార్క్​లో జరిగే ధర్నాను విజయవంతం చేయాలని విద్యార్థులను కోరారు.

ఈ నెల 17న జరిగే ధర్నాను విజయవంతం చేయండి

By

Published : May 15, 2019, 9:08 PM IST

సామాజిక మాధ్యమాల్లో వచ్చిన వార్తలను పోలీస్ శాఖ ఆసరాగా తీసుకుని తెలంగాణ విద్యార్థి ఐక్య వేదికపై దాడులు చేయడం సరికాదని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మద్దిలేటి అన్నారు. తెలంగాణ సాధన కోసం విద్యార్థి సంఘం పోరాటాలు చేస్తే చివరికి రాష్ట్ర ప్రభుత్వం నక్సలిజం పేరును అంటకట్టిందని ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ శాఖ ఏబీవీపీ కార్యకర్తలను ప్రోత్సహిస్తూ తెలంగాణ విద్యార్థి ఐక్య వేదికపై దాడులు చేస్తున్నదని విమర్శించారు. పోలీస్ శాఖతో పాటు ప్రభుత్వ తీరుని ఖండిస్తూ ఈ నెల 17న హైదరాబాదులోని ఇందిరాపార్క్​​లో జరిగే ధర్నా కార్యక్రమాన్ని మేధావులు, విద్యార్థులు విజయవంతం చేయాలని కోరారు. ఏబీవీపీ విద్యార్థి సంఘంపై సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు చేస్తామని మద్దిలేటి తెలిపారు.

ఈ నెల 17న జరిగే ధర్నాను విజయవంతం చేయండి

ABOUT THE AUTHOR

...view details