సమ్మెకు మద్దతు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ... కరీంనగర్‌లోని మంత్రుల ఇళ్ల వద్ద ఆర్టీసీ కార్మికులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. 18రోజులుగా కార్మికులు సమ్మె చేస్తున్నా... మంత్రులు పట్టించుకోవడం లేదని ప్లకార్డులతో ర్యాలీ నిర్వహించారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్‌తో పాటు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ఇళ్ల ముందు ఆందోళన చేశారు. సీఎం కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తుంటే మంత్రులు నిలదీయాల్సింది పోయి అసలు పట్టించుకోవడం లేదని కార్మికులు మండిపడ్డారు. మంత్రులు అందుబాటులో లేకపోవటం వల్ల వారి వ్యక్తిగత సహాయకులకు వినతిపత్రాలు అందజేశారు. ఈటల ఇంట్లో ఎవరు లేకపోవటం వల్ల ఆయన ఇంటికి వినతిపత్రం అంటించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న డిమాండ్‌ను కార్మికులు వెనక్కి తగ్గారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కమిటీలంటూ ప్రభుత్వం కాలయాపన చేయకుండా.. కార్మికులతో చర్చించాలని డిమాండ్ చేశారు.
మంత్రుల ఇళ్లను ముట్టడించిన ఆర్టీసీ కార్మికులు
కరీంనగర్‌లోని మంత్రుల నివాసాలను ఆర్టీసీ కార్మికులు ముట్టడించారు. మంత్రులు గంగుల కమలాకర్, ఈటల రాజేందర్ ఇళ్ల ముందు ఆందోళన నిర్వహించారు. ఇళ్లకు వినతి పత్రాలు అంటించారు.
TSRTC EMPLOYEES MINISTERS HOUSES MUUTADI IN KARIMNAGAR