కరీంనగర్ నగర పాలక సంస్థ ప్రత్యేక కాల్‌సెంటర్‌ను ప్రారంభించింది. కార్పొరేషన్ పరిధిలో ప్రజలు ఎదుర్కొనే సమస్యలకు వెంటనే ఈ కేంద్రానికి ఫోన్ చేయాలని కాల్‌సెంటర్ ప్రారంభించిన మేయర్ సునీల్‌రావు, కమిషనర్ క్రాంతి తెలిపారు.
కరీంనగర్లో ప్రత్యేక కాల్‌సెంటర్ ఏర్పాటు
దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమలౌతున్న నేపథ్యంలో ప్రజలకు ఇబ్బంది లేకుండా కరీంనగర్ నగర పాలక సంస్థ ప్రత్యేక కాల్‌సెంటర్‌ను ప్రారంభించింది. ఏదైనా సమస్యలుంటే వెంటనే ఈ కేంద్రానికి ఫోన్ చేయాలని పేర్కొన్నారు.
కరీంనగర్లో ప్రత్యేక కాల్‌సెంటర్ ఏర్పాటు
కార్యాలయం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పనిచేస్తుందన్నారు. ఫోన్ ద్వారా ఫిర్యాదు చేస్తే ఎలాంటి చర్య తీసుకున్నారో మళ్లీ ఫోన్ చేసి తెలియజేస్తామని మిషనర్ వివరించారు. కేవలం పారిశుద్ధ్యం, నీటి సమస్యలే కాకుండా కరోనా వైరస్‌కు సంబంధించిన సమాచారం ఉంటే వెంటనే చెప్పాలని తెలిపారు. వచ్చిన ఫిర్యాదులపై అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడూ సమీక్షిస్తుందని మేయర్ సునీల్‌రావు తెలిపారు.
ఇదీ చూడండి:'అడుగు బయట పెట్టకు.. ఆపదలో పడకు'