తెలంగాణ

telangana

ETV Bharat / state

మహిళాభ్యున్నతికి సావిత్రిబాయి కృషి ఎనలేనిది: మేయర్

కరీంనగర్‌లో సావిత్రిబాయి జయంత్యుత్సవాలు ఘనంగా నిర్వహించారు. మేయర్ సునీల్ రావు ఈ కార్యక్రమానికి హాజరై సావిత్రిబాయి చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. స్త్రీల అభ్యుదయానికి ఆమె ఎనలేని కృషి చేశారని గుర్తు చేశారు.

savitribai-phule-birthday-celebrations-in-karimnagar
స్త్రీల అభ్యుదయానికి సావిత్రిబాయి కృషి ఎనలేనిది: మేయర్

By

Published : Jan 3, 2021, 4:45 PM IST

స్త్రీల అభ్యుదయానికి విద్యతో పునాదులు వేసిన సామాజిక ఉద్యమకారిణి సావిత్రిబాయి పూలే అని కరీంనగర్ మేయర్ సునీల్ రావు అన్నారు. సావిత్రిబాయి పూలే జయంతిని పురస్కరించుకొని నగరంలోని జ్యోతిబాపూలే పార్క్‌లో బీసీ సంఘం ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు హాజరైన మేయర్... సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. నిమ్న వర్గాల అభ్యున్నతి కోసం అలుపెరుగని పోరాటం చేసి... మహిళల విద్యాభివృద్ధికి ఎనలేని కృషి చేశారని గుర్తు చేశారు.

రచయిత్రిగా పనిచేసి భారతదేశ మొట్టమొదటి ఉపాధ్యాయురాలిగా సేవలందిచారని అన్నారు. నగరపాలక సంస్థ స్మార్ట్ సిటీ ఆధ్వర్యంలో తెలంగాణ చౌక్‌లో ఉన్న సర్కస్ గ్రౌండ్‌కు జ్యోతిబాపూలే పార్క్‌గా గతంలోనే నామకరణం చేశామని... పార్కులో ఆయన విగ్రహంతో పాటు సావిత్రిబాయి పూలే విగ్రహం ఏర్పాటు చేస్తామని మేయర్ తెలిపారు.

ఇదీ చదవండి:కేసీఆర్ నగర్.. దేశంలోనే ఎంతో ప్రత్యేకమైనది: హరీశ్​రావు

ABOUT THE AUTHOR

...view details