ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా గుడ్లూరు మండలం మోచర్ల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆగివున్న లారీని వెనుక నుంచి కారు ఢీ కొట్టిన ఘటనలో కరీంనగర్ జిల్లాకు చెందిన ఆరుగురు అక్కడిక్కడే మృతి చెందారు. కరీంనగర్ నుంచి తిరుపతి వెళ్తుండగా మోచర్ల వద్ద ఈ ప్రమాదం జరిగింది. బాధితులంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించారు. మృతుల్లో బాలుడు, ఇద్దరు మహిళలు ఉన్నారు.
ఏపీలో ప్రమాదం.. ఆరుగురు కరీంనగర్ వాసుల మృతి
ఏపీలోని ప్రకాశం జిల్లా మోచర్ల వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కరీంనగర్‌కు చెందిన ఆరుగురు మృతి చెందారు.
ప్రమాదానికి గురైన కారు