కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కురిక్యాల వద్ద రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వారిని ఆ వైపుగా వెళ్తున్న చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఆదుకున్నారు. కారు, బైక్ ఢీకొన్న ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన యువకుడికి ప్రాథమిక చికిత్స జరిపించారు. అనంతరం అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు.
ఎమ్మెల్యే దాతృత్వం.. ప్రమాద బాధితుడిని ఆస్పత్రికి తరలింపు
ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ తన దాతృత్వాన్ని చాటుకున్నారు. రోడ్డుప్రమాదంలో గాయపడ్డ ఓ బాధితుడికి ప్రథమ చికిత్స అందించి.. ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు.
ఎమ్మెల్యే దాతృత్వం.. ప్రమాద బాధితుడిని ఆస్పత్రికి తరలింపు
ఈ సందర్భంగా క్షతగాత్రుని పట్ల మానవత్వాన్ని ప్రదర్శించిన ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ను స్థానికులు అభినందించారు.