తెలంగాణ

telangana

ETV Bharat / state

సైనిక పాఠశాలను సందర్శించిన మంత్రి

కరీంనగర్​ జిల్లా రుక్మాపూర్​ సైనిక పాఠశాలను మంత్రి కొప్పుల ఈశ్వర్​ సందర్శించారు. విద్యార్థులు పట్టుదలతో కృషి చేసి ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని కోరారు.

సైనిక పాఠశాలను సందర్శించిన మంత్రి

By

Published : Jul 12, 2019, 8:40 PM IST

కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం రుక్మాపూర్ సైనిక పాఠశాలను రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ సందర్శించారు. పేద పిల్లలు ఉన్నత శిఖరాలను చేరుకోవడానికి తొలిసారిగా సైనిక పాఠశాలలు నెలకొల్పినట్లు వెల్లడించారు. విద్యార్థులు తమ లక్ష్యాలను నిర్దేశించుకుని ఆ మేరకు పట్టుదలతో కృషి చేయాలని కోరారు. రుక్మాపూర్ సైనిక్ పాఠశాల దేశంలోనే ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పాఠశాల నిర్వహణపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ తిలకించారు. పాఠశాల భవన సముదాయాన్ని స్వయంగా పరిశీలించారు. అనంతరం విద్యార్థులు కరాటే, జిమ్నాస్టిక్స్, బాక్సింగ్ ప్రదర్శించారు.

సైనిక పాఠశాలను సందర్శించిన మంత్రి

ABOUT THE AUTHOR

...view details