తెలంగాణ

telangana

ETV Bharat / state

నాయిబ్రాహ్మణులకు ఫేస్​ షీల్డులను పంపిణీ చేసిన మంత్రి

కరీంనగర్​లో శ్రీ సేవా మార్గ్​ సంస్థ ఆధ్వర్యంలో వంద మంది నాయిబ్రాహ్మణులకు మంత్రి గంగుల ఫేస్​ షీల్డులను పంపిణీ చేశారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రతి ఒక్కరు భౌతిక దూరం పాటించాలని సూచించారు.

minister gangula kamalakar distributed face shieds to barbers in karimnagar
నాయిబ్రాహ్మణులకు ఫేస్​ షీల్డులను పంపిణీ చేసిన మంత్రి

By

Published : May 12, 2020, 8:55 PM IST

కరీంనగర్​ అశోక్​నగర్​లోని శ్రీవాసవి మాతా ఆలయంలో శ్రీ సేవా మార్గ్ సంస్థ ఆధ్వర్యంలో 100 మంది నాయిబ్రాహ్మణులకు మంత్రి గంగుల కమలాకర్​ ఫేస్​షీల్డులు పంపిణీ చేశారు. లాక్​డౌన్​ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సడలిస్తున్న ఈ సమయంలో ప్రతీ ఒక్కరు భౌతిక దూరాన్ని పాటిస్తూ మాస్కులను తప్పనిసరిగా ధరించాలని మంత్రి సూచించారు. ముఖ్యంగా సెలూన్లలో పని చేసే వ్యక్తులు మరిన్ని జాగ్రత్తలు పాటించాలన్నారు.

శ్రీ సేవా మార్గ్ సంస్థ ద్వారా ముఖం మొత్తం కవర్ చేసేలా ప్రత్యేకంగా తయారు చేసిన ఫేస్ షీల్డ్ మాస్కుల వల్ల నాయిబ్రాహ్మణులతో పాటు వినియోగదారులకు కూడా రక్షణ చేకూరుతుందన్నారు. ఇలాంటి మాస్కులను సంస్థ ప్రత్యేకంగా తయారు చేసి పంపిణీ చేయడం హర్షించదగ్గ విషయమని ప్రశంసించారు.

ఇవీ చూడండి: అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి నిరంజన్ రెడ్డి

ABOUT THE AUTHOR

...view details