భూవివాదంతో అన్నదమ్ములపై కత్తితో ఓ వ్యక్తి కత్తితో దాడిచేశాడు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంలో జరిగింది. పట్టణానికి చెందిన శ్రీపతి సారయ్య, శ్రీపతి బాబురావు, శ్రీపతి రమేశ్ ముగ్గురు అన్నదమ్ములు. వీరి మధ్య గత కొంతకాలంగా భూమి వివాదం కొనసాగుతోంది. ఈ క్రమంలో శ్రీపతి రమేశ్ కత్తితో శ్రీపతి సారయ్య, తన కుమారుడు కరుణాకర్, శ్రీపతి బాబురావులపై కత్తితో విచక్షణరాహితంగా దాడి చేశాడు.
అన్నదమ్ములపై కత్తితో దాడి.. ముగ్గురికి తీవ్రగాయాలు
భూ తగాదాలతో ఓ వ్యక్తి తన అన్నదమ్ములపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో చోటుచేసుకుంది. క్షతగాత్రులు ముగ్గురిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు.
అన్నదమ్ములపై కత్తితో దాడి.. ముగ్గురికి తీవ్రగాయాలు
ఈ ఘటనలో వారు ముగ్గురూ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు, కుటుంబ సభ్యులు క్షతగాత్రులను హుటహుటిన హుజూరాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ప్రథమ చికిత్సను అందించారు. మెరుగైన వైద్యం కోసం వరంగల్ ఎంజీఎంకు ఆసుపత్రికి తీసుకెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
ఇదీ చూడండి:దేశవ్యాప్తంగా లాక్డౌన్... కరోనా కేసులు@471