రేయింబవళ్లు శ్రమిస్తున్న పోలీసుల సేవలు అభినందనీయమని... వారికి మానసిక ఉల్లాసాన్ని కల్పించేందుకు ఆత్మీయ సమ్మేళనం ఎంతగానో ఉపయోగపడుతుందని కరీంనగర్ జిల్లా జడ్జి అనుపమ చక్రవర్తి అన్నారు. పోలీస్ కమిషనర్ కమలాసన్ రెడ్డి ఏర్పాటు చేసిన ఈ ఆత్మీయ సమ్మేళనానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, నగర పాలక సంస్థ కమిషనర్ వేణుగోపాల్ రెడ్డి, పోలీస్ శాఖ అధికారులు పాల్గొన్నారు. జిల్లా నుంచి బదిలీ అయి వెళ్లిపోయిన కొందరు పోలీస్ అధికారులకు జ్ఞాపికలు అందించారు. హైదరాబాద్ కళాకారుల నృత్యాలు, పాటలు అందరినీ ఆకట్టుకున్నాయి.
ఆత్మీయ సమ్మేళనాలతో పోలీసులకు మానసికోల్లాసం - కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్
కరీంనగర్ పోలీస్ కమిషనర్ కమలాసన్ రెడ్డి జిల్లా కేంద్రంలో పోలీసుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. జిల్లా జడ్జి అనుపమ చక్రవర్తి, కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ పాల్గొన్నారు.
ఆత్మీయ సమ్మేళనాలతో పోలీసులకు మానసికోల్లాసం