కరీంనగర్లో ఈచ్ వన్ టీచ్ వన్ కార్యక్రమంతో ప్రతి ఒక్కరికి అక్షర జ్ఞానం కలిగించేందుకు కృషి చేస్తామని కలెక్టర్ శశాంక అన్నారు. గన్నేరువరం మండలంలోని గుండ్లపల్లి, జంగపల్లి, మాదాపూర్లో పర్యటించారు. పల్లె ప్రగతిలో కొనసాగుతున్న పనులను పరిశీలించారు.
'ప్రజల సహకారముంటే.. పల్లె ప్రగతి పరుగులు పెడుతుంది' - కలెక్టర్ శశాంక
ప్రజాప్రతినిధుల చొరవ, అధికారుల నిబద్ధత, గ్రామస్థుల సహకారంతో పల్లెలను ప్రగతి పథంలో ముందుకు నడిపించవచ్చని కరీంనగర్ జిల్లా కలెక్టర్ శశాంక అన్నారు. గన్నేరువరం మండలంలోని పలు గ్రామాల్లో పల్లె ప్రగతి కార్యక్రమాన్ని పరిశీలించారు.
మొక్కలు నాటడం, వాటి సంరక్షణకు ట్రీ గార్డ్ల ఏర్పాటు, స్మశానవాటికలు, ఇంకుడు గుంతలు, డంపింగ్ యార్డ్ నిర్మాణం, పారిశుద్ధ్య పనులను కలెక్టర్ శశాంక పర్యవేక్షించారు.
మాదాపూర్ గ్రామంలో ఇంటింటికో ఇంకుడు గుంత, మరుగుదొడ్లు, వర్మికంపోస్ట్, ఫారం పాంట్స్ నిర్మాణాలు, పచ్చదనం, పారిశుద్ధ్యం నిర్వహిస్తున్న తీరును కలెక్టర్ ప్రశంసించారు. గ్రామ పంచాయతీ పాలక వర్గానికి గ్రామస్థులు అండగా నిలుస్తున్న తీరుకు హర్షం వ్యక్తం చేశారు. అభివృద్ధిలో ముందుకు సాగుతూ మిగతా గ్రామాలకు ప్రేరణగా నిలవాలని సూచించారు.
- ఇవీ చూడండి: పురపోరుకు సై అంటున్న రియల్టర్లు