తెలంగాణ

telangana

ETV Bharat / state

సమత, మమతల దుస్థితిపై హెచ్చార్సీ స్పందన - smatha and mamatha

అమ్మానాన్నలు మరణించి... నా అన్న వారు ఎవరూ లేకుండా అనాథలుగా మిగిలిన సమత, మమతలకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని అధికారులను హెచ్చార్సీ ఆదేశించింది. ఈ మేరకు కరీంనగర్ జిల్లా మహిళా అభివృద్ధి, శిశుసంక్షేమ శాఖ అధికారికి నోటీసులు జారీ చేసింది.

hrc responded on smatha and mamatha situation
సమత, మమతల దుస్థితిపై హెచ్చార్సీ స్పందన

By

Published : May 7, 2020, 3:20 PM IST

కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం కాట్నపల్లిలో అనాథలైన అక్కాచెల్లెళ్ల దయనీయ స్థితిపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ స్పందించింది. నేరెళ్ల సమత(18), మమత (12)ల తండ్రి పాపయ్య ఐదు రోజుల కిందట మరణించాడు. ఈ విషయమై తక్షణమే ఆ అక్కాచెల్లెళ్లకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని కరీంనగర్ జిల్లా మహిళా అభివృద్ధి, శిశుసంక్షేమ శాఖ అధికారికి నోటీసులు జారీ చేసింది. వారి కోసం తీసుకున్న చర్యలపై మే 6లోపు నివేదిక ఇవ్వాలని ఆదేశాలిచ్చింది.

ఇవీ చూడండి:విశాఖ ఘటనపై సీఎం కేసీఆర్​ దిగ్భ్రాంతి

ABOUT THE AUTHOR

...view details