కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని సుభాష్ నగర్లో రైతులు ధాన్యం లోడుతో ధర్నాకి దిగారు. అధికారులు ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదని వాపోయారు. రామ కృష్ణ కాలనీ కొనుగోలు కేంద్రంలో ధాన్యం కుప్పలుగా పోయాల్సి వస్తోందని అయినప్పటికీ... అధికారులు ధాన్యాన్ని కొనట్లేదని తెలిపారు. ప్రభుత్వం అండగా నిలవాలని కోరుతూ నిరసన చేపట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని రైతులకు నచ్చజెప్పి ఆందోళన విరమింపజేశారు.
'ధాన్యం కుప్పలుగా పోగవతున్న కొనే వారు లేరు' - కరీంనగర్ జిల్లా సుభాష్ నగర్లో రైతుల ఆందోళన
కరీంనగర్ జిల్లా సుభాష్ నగర్లో ధాన్యం కొనుగోలు చేయట్లేదంటూ రైతులు ఆందోళన నిర్వహించారు.
'ధాన్యం కుప్పలుగా పోగవతున్న కొనే వారు లేరు'