కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలో బృహత్తరమైన పథకాలను తీసుకువచ్చి నగరాన్ని ఎంతో అభివృద్ధి చేశామని మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ అభిప్రాయపడ్డారు. ఐదేళ్లో చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించిన సమాచారాన్ని పుస్తకం రూపంలో తీసుకొచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పుస్తకాన్ని అందజేశారు. పదవి చేపట్టిన తర్వాత తమ కుటుంబం వారికి కాంట్రాక్టులు ఇప్పించకుండా నిస్వార్ధంగా పనిచేసినట్లు ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి దిశానిర్దేశం మేరకు నగరాభివృద్ధిని చేస్తానని ఆయన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కరీంనగర్‌లో గులాబీ జెండా ఎగరవేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
మున్సి'పోల్స్'లో తెరాసదే విజయం: సర్దార్ రవీందర్ సింగ్
కరీంనగర్ పట్టణంలో గత ఐదేళ్లలో అభివృద్ధి గణనీయంగా జరిగిందన్నారు కరీంనగర్ మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్. ఐదేళ్లలో చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించిన పుస్తకాన్ని తీసుకొచ్చారు. రానున్న నగరపాలక ఎన్నికల్లో తెరాస ఘనవిజయం సాధిస్తుందన్నారు రవీందర్ సింగ్.
మున్సి'పోల్స్'లో తెరాసదే విజయం: సర్దార్ రవీందర్ సింగ్
TAGGED:
55