తెలంగాణ

telangana

ETV Bharat / state

etela announce support to jps and voa strikes : ఉద్యమ సమయం.. హామీలు అమలు చేయాలి

Etela Rajender announce support to JPS and VOA strike : ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్న ఔట్​సోర్సింగ్​, కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని తెలంగాణ ఉద్యమ సమయంలో మాట్లాడిన మాటలు .. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పడు గుర్తుకు తెచ్చుకోవాలని బీజేపీ నేత ఈటల రాజేందర్ అన్నారు. కరీంనగర్​లో పర్యటించిన ఆయన.. జేపీఎస్​, వీఓఏల దీక్ష శిబిరాన్ని సందర్శించి వారికి మద్దతు ప్రకటించారు.

Etala Rajender
Etala Rajender

By

Published : May 9, 2023, 5:41 PM IST

Etela Rajender announce support to JPS and VOA strike : తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలంటూ.. నిరవధిక సమ్మె చేస్తున్నటువంటి జూనియర్ పంచాయతీ కార్యదర్శులు, వీఓఏల న్యాయమైన సమస్యలను రాష్ట్రప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని బీజేపీ నేత ఈటల రాజేందర్​ డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిరవధిక సమ్మె చేపడుతున్న పంచాయతీరాజ్ కార్యదర్శులు, ఐకేపీ మహిళా సంఘాల నిరవధిక సమ్మెకు హాజరై.. మద్దతు తెలుపుతున్నట్లు ఈటల రాజేందర్ ప్రకటించారు.

బెదిరింపులు తగదు.. గత కొన్ని రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగుల నిరసనలు.. రాష్ట్ర ప్రభుత్వానికి కనిపించడం లేదా అని ఈటల రాజేందర్ ఎద్దేవా చేశారు. ఐకేపీ సంఘాల్లో పనిచేస్తున్న వీఓఏలను క్రమబద్ధీకరించాలని.. ఉద్యోగ భద్రత కల్పిస్తూ కనీసం 26 వేల వేతనం ఇవ్వాలని ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. ప్రభుత్వం జూనియర్​ పంచాయతీ కార్యదర్శులను.. ఈరోజు సాయంత్రం ఐదు గంటల్లోగా విధుల్లోకి చేరకపోతే తీసేస్తామని బెదిరింపులకు గురిచేయడం భావ్యం కాదని.. కార్యదర్శి సంఘాలను పిలిపించి వారితో మాట్లాడాలని ముఖ్యమంత్రి కేసీఆర్​కు ఈటల హితవు పలికారు.

కన్నీరు మంచిది కాదు.. అధికారము తల్లిదండ్రుల నుంచి రాదని, ప్రజలే నిర్ణయిస్తారని.. సరైన సమయం వచ్చినప్పుడు వారే తగిన బుద్ధి చెబుతారని పేర్కొన్నారు. ఆడకూతుళ్ల కన్నీళ్లను కళ్ల చూడటం తగదని.. వారి కోపానికి అధికార పీఠాలే కూలిపోయాయని హెచ్చరించారు. కాంట్రాక్టు ఉద్యోగులను బెదిరిస్తే ఊరుకునేది లేదని.. నిరవధిక సమ్మె చేపడుతున్న కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఈటల భరోసా కల్పించారు వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఆశీర్వదించాలని.. మహిళలను కంటతడి పెట్టకుండా చూస్తామని అన్నారు. జూనియర్ పంచాయతీ సెక్రటరీలకు, ఐకేపీ వీఓఏలకులకు బీజేపీ పూర్తి మద్దతు ప్రకటిస్తుందని.. ఉద్యోగాల క్రమబద్ధీకరణ చేసేంతవరకు నిరసనలు కొనసాగించాలని పిలుపునిచ్చారు.

"ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్న ఔట్​సోర్సింగ్​, కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని తెలంగాణ ఉద్యమ సమయంలో మాట్లాడిన మాటలు.. ముఖ్యమంత్రి కేసీఆర్ గుర్తుకు తెచ్చుకోవాలి. జూనియర్ పంచాయతీ కార్యదర్శులు, వీఓఏల సమస్యలను రాష్ట్రప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలి. అధికారం తల్లిదండ్రుల నుంచి రాదు. ప్రజలే నిర్ణయిస్తారు. సరైన సమయం వచ్చినప్పుడు వారే తగిన బుద్ధి చెబుతారు." - ఈటల రాజేందర్, బీజేపీ ఎమ్మెల్యే​

ఉద్యమ సమయం.. హామీలు అమలుచేయాలి

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details