అనాదిగా వస్తోన్న ఆచారం...
పోలీస్స్టేషన్లో లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు
ఎక్కడైనా... దేవుళ్ల బ్రహ్మోత్సవాలు ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో జరుగుతాయి. కానీ ధర్మపురిలో మాత్రం ఎక్కడలేని విధంగా స్థానిక పోలీస్స్టేషన్లో స్వామివారు వైభవంగా పూజలందుకున్నారు. పోలీసులే దగ్గరుండి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనాదిగా వస్తోన్న ఆచారం...
జిల్లా ఎస్పీ సింధుశర్మ, పోలీస్ కుటుంబాలు స్వామివార్లకు ఠాణాలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనాదిగా వస్తున్న ఆచారాన్ని పోలీసులతోపాటు స్థానికులూ భక్తి శ్రద్ధలతో పాటిస్తారని దేవస్థాన అర్చకులు చెప్పారు.