కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తున్న వేళ గ్రామస్థాయి నుంచి మహానగరాల వరకు అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. వీరితో పాటు కొందరు తమ ప్రతిభను నిరూపించుకోవడంతో పాటు... వైరస్ పట్ల అవగాహన కల్పిస్తున్నారు.
రోడ్లపై వైరస్ బొమ్మ... బయటకు రావద్దని హెచ్చరిస్తోంది...
కరోనాపై అవగాహన కల్పించేందుకు ఒక్కొక్కరు తమ ప్రతిభను చాటుతూ ప్రజలను చైతన్యపరుస్తున్నారు. కరీంనగర్‌లోని ఆర్టిస్టులు... కూడళ్ల వద్ద కరోనా బొమ్మలను వేస్తూ అవగాహన కల్పిస్తున్నారు.
రోడ్లపై వైరస్ బొమ్మ... బయటకు రావద్దని హెచ్చరిస్తోంది...
కరీంనగర్‌కు చెందిన ఆర్టిస్టులు... గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు వైరస్‌పై అవగాహన కల్పించేందుకు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. గ్రామాలకు వెళ్లే కూడళ్లు, రహదారుల వద్ద వైరస్ బొమ్మలను వేస్తూ... అవగాహన కల్పిస్తూ... ఆదర్శంగా నిలుస్తున్నారు.
ఇవీ చూడండి:సంప్రదాయాలే మనకు రక్ష: గవర్నర్