తీగలగుట్టపల్లిలో పోలీసుల కట్టడి ముట్టడి - rtc colony
నగరపాలక సంస్థ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కరీంనగర్లో పోలీసులు నిర్భంద తనిఖీలు నిర్వహించారు.
తీగలగుట్టపల్లిలో పోలీసు కట్టడి ముట్టడి
కరీంనగర్ జిల్లా తీగలగుట్టపల్లిలోని ఆర్టీసీ కాలనీలో గ్రామీణ ఏసీపీ ఉషారాణి ఆధ్వర్యంలో 150 మంది పోలీసులతో నిర్బంధ తనిఖీలు చేపట్టారు. సరైన పత్రాలు లేని 30 ద్విచక్ర వాహనాలు, 5 క్వింటాళ్ల రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్నారు. కాలనీల్లో సీసీ కెమెరాల ఏర్పాటుపై ప్రజలకు అవగాహన కల్పించారు.