కరీంనగర్ జిల్లా గంగాధర మండలం గట్టుబూత్కుర్ గ్రామాన్ని కలెక్టర్ శశాంక సందర్శించారు. గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి పనులను ఆయన పరిశీలన చేశారు. జాతీయ గ్రామీణ ఉపాధీ హామీ పథకం పనులను క్షేత్ర స్థాయిలో సందర్శించి.. కూలీల భాగస్వామ్యాన్ని పెంచాలని ఆదేశించారు.
అభివృద్ధి పనులను పరిశీలించిన కలెక్టర్
కరీంనగర్ జిల్లా గంగాధర మండలం గట్టుబూత్కుర్ గ్రామాన్ని కలెక్టర్ శశాంక సందర్శించారు. గ్రామంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు.
కూలీల సమస్యలను అడిగి తెలుసుకుని సకాలంలో డబ్బులు చెల్లించాలన్నారు. వేసవిలో ఇబ్బంది లేకుండా తాగునీరు, నీడ సౌకర్యం, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, మెడికల్ కిట్లు సిద్ధంగా ఉంచాలని సూచించారు. అనంతరం పల్లె ప్రకృతి వనం, వన నర్సరీ, కంపోస్టు షెడ్, శ్మశానవాటిక నిర్మాణాలను పరిశీలించారు. వన నర్సరీల్లో పెంచుతున్న మొక్కలకు నీటికొరత లేకుండా శ్రద్ధ చూపాలని అన్నారు. గ్రామంలో పారిశుద్ధ్య చర్యలను పకడ్బందీగా నిర్వహించాలని కోరారు. కంపోస్టు షెడ్లో వానపాములను వదిలి సేంద్రీయ ఎరువుల తయారీ ప్రక్రియను ప్రారంభించారు.