కరీంనగర్ జిల్లా అలుగునూరు వద్ద కాకతీయ కాలనీలో కారు పడిన ఘటనలో దంపతులు మృతిచెందారు. మృతులు సుల్తానాబాద్ మండలం కనుగుల గ్రామానికి చెందిన మాచర్ల శ్రీనివాస్, స్వరూపగా పోలీసులు గుర్తించారు. దిగువ మానేరు కాల్వ పక్కన కారును నిలిపిన శ్రీనివాస్ తిరిగి వెళ్లేందుకు వాహనాన్ని తీస్తుండగా.. ప్రమాదవశాత్తు కాల్వలో పడిపోయింది. దాదాపుగా 3వందల మీటర్ల దూరం కారు కాల్వలో కొట్టుకుపోయింది. సమాచారమందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని మృతులతో పాటు కొట్టుకుపోయిన కారును బయటికి తీశారు.
కాకతీయ కాలువలో కారు... దంపతులు మృతి
ప్రమాదవశాత్తు కాకతీయ కాలువలో కారు పడిన ఘటన కరీంనగర్ జిల్లా అలుగునూరు వద్ద చోటుచేసుకుంది. ఈ ఘటనలో దంపతులు మృతి చెందారు.
ప్రమాదవశాత్తు కాకతీయ కాలువలో కారు... ఇద్దరు మృతి