నిర్మాణంలో ఉన్న ఇంట్లోకి దూరిన పాము
నిర్మాణంలో ఉన్న ఓ ఇంట్లో దూరిన పాము కలకలం సృష్టించింది. అప్రమత్తమైన స్థానికులు వెంటనే పాములు పట్టే వ్యక్తికి సమాచారం అందించారు.
పామును నగర శివార్లలో వదిలిపెడతా : సుమన్
కరీంనగర్ విద్యారణ్య పురిలో నిర్మాణంలో ఉన్న ఓ ఇంటిలో పాము కలకలం రేపింది. భయాందోళనకు గురైన స్థానికులు వెంటనే పాములు పట్టే వ్యక్తి సుమన్‌కు సమాచారం అందించగా ఇంటిలోని సంపులో దూరిన పామును పట్టుకున్నాడు. నగర శివార్లలో వదిలిపెడతానని చెప్పారు. పాములు ఎవరికి ఏ హాని చేయవని, వాటిని చంపొద్దని ఆయన సూచించారు.