కరోనా కట్టడికి అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. కామారెడ్డి జిల్లా మద్నూర్-మహారాష్ట్ర సరిహద్దు గ్రామాల్లో కరోనా వైరస్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. మహారాష్ట్రలో కరోనా వ్యాప్తి రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో సరిహద్దు గ్రామాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
సరిహద్దు ప్రాంతాల్లో మరింత పకడ్బందీ నిఘా
కరోనా కట్టడికి కామారెడ్డి జిల్లా అధికారులు పకడ్బందీ కార్యాచరణలు చేపడుతున్నారు. మహారాష్ట్ర కామారెడ్డి సరిహద్దు ప్రాంతాలను మూసేసి అక్కడి నుంచి ఎవరూ రాకపోకలు చేయకుండా.. అన్ని సరిహద్దు గ్రామాల ప్రజలను అప్రమత్తంగా ఉండాలని పలు సూచనులు ఇస్తున్నారు.
సరిహద్దు ప్రాంతాల్లో మరింత పకడ్బందీ నిఘా
ఇతర రాష్ట్రాల నుంచి ఎవ్వరు రాకుండా సలబత్పూర్ తనిఖీ కేంద్రం వద్ద నిరంతరం అధికారుల బృందం విధులు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ నుంచి రెండు లారీల్లో రాజస్థాన్ వెళ్తున్న 40 మంది కూలీలను అధికారులు పట్టుకున్నారు. గ్రామాల్లో కూడా రోడ్లకు అడ్డుగా కంచెలు ఏర్పాటు చేస్తున్నారు. మహారాష్ట్ర, కర్ణాటక సరిహద్దు గ్రామాల శివారులో ఎవ్వరు రాకుండా కందకాలను తవ్విస్తున్నారు.
ఇవీ చూడండి: లక్ష మంది రోగులకైనా చికిత్స: కేసీఆర్