కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం సోమూర్లో విద్యుత్తు చౌర్యాన్ని గుర్తించేందుకు ఆశాఖ అధికారులు గ్రామానికి వెళ్లారు. గత కొంతకాలంగా విద్యుత్తు చౌర్యానికి పాల్పడుతున్న ఒక కుటుంబం విద్యుత్ శాఖ అధికారులపై దాడి చేసింది. ఇందుకు నిరసనగా అధికారులు గ్రామానికి నిన్నటి నుంచి విద్యుత్తు సరఫరా నిలిపి వేశారు. ఒక్క కుటుంబం చేసిన తప్పుకు ఊరుని అంధకారంలోకి తోస్తారా అంటూ గ్రామస్థులు ఆందోళనకు దిగారు. ఇది ఎంతవరకు సమంజసమని అధికారులను ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా విద్యుత్ సరఫరా పునరుద్ధరించాలని కోరుతున్నారు.
ఒక్క కుటుంబం తప్పు చేస్తే... ఊరందరికి శిక్ష - NO POWER
ఎవరో ఒకరు చేసిన తప్పుకు ఊరంతా శిక్షననుభవిస్తోంది. నిన్నటి నుంచి గ్రామంలో విద్యుత్తు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు గ్రామస్థులు. రాత్రంతా దోమలతో నిద్ర పట్టక జాగరణ చేయాల్సి వచ్చింది.
ఒక్క కుటుంబం తప్పు చేస్తే... ఊరందరికి శిక్ష