కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలంలో చిరుత సంచారం కలకలంరేపుతోంది. సోమరపేట గ్రామంలో ఓ వ్యక్తిపై దాడిచేసి, గాయపర్చింది. మంగళవారం రాత్రి గొర్రెల మంద వద్దకు వచ్చిన చిరుత... జీవాలపై దాడికి యత్నించింది. పక్కనే ఉన్న కాపరి మల్లేశం గమనించి.... చిరుతను తరిమేందుకు వెళ్లాడు.
గొర్రెల కాపరిపై దాడి చేసిన చిరుత - కామారెడ్డి జిల్లా లేటెస్ట్ వార్తలు
రాష్ట్రంలో చిరుతల సంచారం నానాటికి పెరుగుతోంది. తాజాగా కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం సోమరపేటలో అర్ధరాత్రి ఓ వ్యక్తిపై చిరుత దాడి చేసింది. చిరుత దాడిలో మల్లేశం అనే వ్యక్తికి గాయాలయ్యాయి.
గొర్రెల కాపరిపై దాడి చేసిన చిరుత
దీంతో కాపరిపై దాడి చేసి గాయపర్చింది. సమాచారం అందుకున్న అటవీశాఖ సిబ్బంది... ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్నారు. వ్యవసాయ పొలం వద్ద చిరుత సంచారంపై పరిసర గ్రామాల ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి:వణికిస్తోంది.. చిరుత దాడిలో మరో ఆవు బలి