కామారెడ్డి పుర పీఠంపై గెలుపు బావుటా ఎగుర వేసేందుకు తెరాస, కాంగ్రెస్ పార్టీలు నువ్వానేనా అన్నట్టు పోటీ పడుతున్నాయి. పట్టణంలో ద్విముఖ పోరు నెలకొనగా... గంప గోవర్దన్, షబ్బీర్ అలీ ముందుడి నడిపిస్తున్నారు.
విజయ పరంపర కొనసాగేనా...?
కామారెడ్డి పురపాలక సంస్థలో 49 వార్డులు ఉండగా... 85,168మంది ఓటర్లు ఉన్నారు. 2014లో జరిగిన పురపోరులో పీఠం కాంగ్రెస్ దక్కించుకున్నా... అనంతరం జరిగిన వలసలతో తెరాస వశమైంది. సగం కాలం అధికారాన్ని దక్కించుకున్నా.. కేవలం 5 సీట్లు మాత్రమే గెలవడం తెరాసకు మింగుడు పడని విషయం. అంసెంబ్లీ ఎన్నికల్లోనూ తెరాస స్వల్ప మెజార్టీతో గెలవటం ఆ పార్టీ శ్రేణుల్లో గుబులు రేపుతోంది. వరుసగా షబ్బీర్ అలీపై విజయం సాధిస్తున్న గంప గోవర్దన్... ఈసారి కామారెడ్డి పీఠాన్ని ఒంటరిగానే సొంతం చేసుకోవాలని శ్రమిస్తున్నారు.