Gandhari Police Station Nizamabad :కామారెడ్డి జిల్లా గాంధారి మండలానికి కొంచెం ఎక్కువ కాలం పని చేసే ఎస్సై కావాలని అక్కడి ప్రజలు కోరుకుంటున్నారు. ఎందుకంటే కొద్దికాలం మాత్రమే పని చేయడం. ఆ తర్వాత బదిలీపై వెళ్లడం వాళ్లకు సాధారణమైపోయింది. కామారెడ్డి జిల్లాలో గిరిజన ప్రజలు అధికంగా ఉండే మండలం గాంధారి. అలాగే విస్తీర్ణం పరంగానూ ఈ మండలం పెద్దదే. తండాలు అధికంగా ఉండే ప్రాంతమిది.
Frequent Transfers inGandhari Police Station Nizamabad :ఎక్కువగా చదువుకోని గిరిజన ప్రజలుండే ఈ ప్రాంతంలో వివాదాలూ ఎక్కువే. కానీ ఈ మండలంలో పని చేసే పోలీస్ సబ్ ఇన్‌స్పెక్టర్‌మాత్రం కొద్దికాలమే ఉంటారు. మారుమూల ప్రాంతం కావడంతో సాధారణంగానే ఎవరూ రావడానికి ఇష్టపడరు. అలాగని వచ్చిన ఎస్సైలు ఎక్కువ కాలం పని చేసే పరిస్థితి లేకుండా పోతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పోలీసుశాఖలో సంచలనం.. 91 మంది అధికారుల స్థానచలనం.. ఉమ్మడి రాష్ట్రంలోనూ ఇదే తొలిసారి
''గాంధారి పోలీస్ స్టేషన్లో ఎస్సైలు మూడు నెలలకు మించి పనిచేయలేకపోతున్నారు. నాయకుల ఒత్తిడి ఇక్కడ ఎక్కువ. ప్రజా సమస్యలపై పని చేయాల్సిన పోలీసులు ఎమ్మెల్యే ఏది చెప్పినా చేయాలి. లేకపోతే అప్పటికప్పుడు బదిలీపై పంపిస్తున్నారు. కొందరు అధికార పార్టీ నేతలు.. చెప్పినట్టు వినకుంటే పోలీసులను.. భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. ప్రస్తుతం పని చేస్తున్న ఎస్సై ప్రజా సమస్యలపై పట్టించుకునేవాడు. ఆయనను కూడా వేరే జిల్లాకు బదిలీ చేశారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు దృష్టి పెట్టి రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా ప్రజల భద్రతకు ప్రాముఖ్యతనిచ్చి పోలీసులు ఎక్కువ కాలం పని చేసేలా చూడాలని కోరుతున్నాను.'' - రమేశ్, కాంగ్రెస్ నాయకుడు
Gandhari Police Station SI Transfers :గాంధారి పీఎస్లో అత్యల్పంగా రెండు నెలలు.. గరిష్ఠంగా రెండేళ్లు మాత్రమే ఎస్సైలు పని చేశారు. ఏడాది, సంవత్సరన్నర, రెండేళ్లు పని చేసిన సందర్భాలను వేళ్ల మీద లెక్కపెట్టే పరిస్థితి ఉండగా.. మూడు, ఆరు లేదంటే తొమ్మిది నెలలు పని చేసిన సందర్భాలే అధికంగా ఉన్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. 2011 నుంచి ఇప్పటి వరకు 14 మంది ఎస్సైలు మారారు. ఎవ్వరూ నిలకడగా లేకపోవడంతో సమస్యలు పేరుకుపోయి మండల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.