తెలంగాణ

telangana

ETV Bharat / state

తండ్రి మరణం... 'కూతురికి పరీక్ష'

కంటి రెప్పలా కాపాడినా తండ్రి దూరమయ్యాడనే బాధ ఓ వైపు.. పరీక్ష కాలం మరో వైపు. ఇలాంటి పరిస్థితి పగవాడికి కూడా రాకూడదనే వేదన. అలాంటి తరుణంలో తండ్రి చనిపోయిన బాధను పంటి బిగువున భరిస్తూ.. పొంగుకొస్తున్న దుఖాన్ని ఆపుకుంటూ ఆ అమ్మాయి పరీక్షకు హాజరైంది. ఈ విషాదకర ఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.

వెన్నెల
వెన్నెల

By

Published : May 25, 2022, 5:14 AM IST

పుట్టెడు దుఃఖంలో పరీక్షకు హాజరైంది ఓ పదోతరగతి విద్యార్థిని. కామారెడ్డి జిల్లా బిచ్కుందలో ఈ విషాదకర ఘటన జరిగింది. బిచ్కుందకు చెందిన వెన్నెల పదోతరగతి వార్షిక పరీక్షలు రాస్తోంది. అయితే పరీక్ష రోజే తండ్రి గుండెపోటుతో చనిపోయాడు. ఇంట్లో తండ్రి మృతదేహం ఉండగానే తప్పనిసరి పరిస్థితిలో పరీక్ష రాసింది.

పరీక్ష కేంద్రంలో వెన్నెల

తండ్రి చనిపోయిన బాధ ఓ వైపు.. పరీక్ష మరోవైపు ఎటూ తేల్చుకోలేక పోయిన సందర్భంలో బంధువులు ధైర్యం చెప్పి పరీక్షకు పంపించారు. ఆ బాధను పంటి బిగువున భరిస్తూ.. పొంగుకొస్తున్న దుఖాన్ని ఆపుకుంటూ ఆమె పరీక్ష రాసింది. పరీక్ష ముగిసిన వెంటనే వెళ్లి తండ్రి అంత్యక్రియల్లో వెన్నెల పాల్గొంది.

ABOUT THE AUTHOR

...view details