తెలంగాణ

telangana

ETV Bharat / state

ఫలితాల షాక్ నుంచి సీఎం కోలుకోలేదు: డీకే అరుణ

దుబ్బాక, హైదరాబాద్ ఫలితాల షాక్ నుంచి సీఎం కోలుకోలేదని ఎద్దేవా చేశారు భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ. రాష్ట్రంలో ప్రజాస్వామ్యయుత పాలన భాజపాతోనే సాధ్యమని ఆమె అన్నారు.

ఫలితాల షాక్ నుంచి సీఎం కోలుకోలేదు: డీకే అరుణ
ఫలితాల షాక్ నుంచి సీఎం కోలుకోలేదు: డీకే అరుణ

By

Published : Dec 13, 2020, 7:02 PM IST

మొన్నటి వరకు ప్రధాని నరేంద్ర మోదీపై యుద్ధం ప్రకటిస్తానని చెప్పిన సీఎం కేసీఆర్... ఇప్పుడు వంగి వంగి దండాలు పెడుతున్నారని భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ధ్వజమెత్తారు. రాష్ట్రంలో తెరాసకు ప్రత్యామ్నాయం భాజపానేనని స్పష్టం చేశారు.

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గం నుంచి తెరాస, కాంగ్రెస్‌ పార్టీల నుంచి సర్పంచ్​లు, మండల, గ్రామ అధ్యక్షులు, ఇతర కార్యకర్తలు డీకే అరుణ సమక్షంలో భాజపాలో చేరారు. రాష్ట్రంలో కుటుంబ పాలన అంతం చేయడానికి ప్రజలంతా సిద్ధమవుతున్నారని పేర్కొన్నారు. ఉద్యమ ఆకాంక్షలు పక్కనబెట్టిన కేసీఆర్... ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ నిధులతోనే గ్రామ పంచాయతీలు అభివృద్ధి చెందుతున్నాయని అరుణ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని ఆక్షేపించారు.

ఇదీ చూడండి:పోలీసు, ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలని సీఎం ఆదేశం

ABOUT THE AUTHOR

...view details