కామారెడ్డి జిల్లా బాన్సువాడ కేంద్రంలోని ప్రాంతీయ వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో నేషనల్ హెల్త్ మిషన్ ప్రోగ్రాం ద్వారా నూతన రక్తనిధి కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. మొత్తం కోటి ఐదు లక్షల రూపాయలతో నిర్మించిన ఈ కేంద్రాన్ని శుక్రవారం తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. రక్తనిధి కేంద్రం రాష్టంలో ఏ ప్రభుత్వ ఆస్పత్రిలో లేదని మొట్ట మొదటగా బాన్సువాడలో ప్రారంభించడం గొప్ప విషయమని సభాపతి తెలిపారు. రక్తం దానం చేసేవారు దేవుడితో సమానమన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సత్యనారాయణ, ఆర్డీఓ రాజేశ్వర్, జిల్లా వైద్యాధికారి అజయ్ కుమార్, అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
రక్తనిధి కేంద్రాన్ని ప్రారంభించిన సభాపతి పోచారం
అత్యవసర సమయంలో రక్తాన్ని అందించేందుకు ప్రభుత్వ దవాఖానల్లో రక్తనిధి కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో భాగంగా కామారెడ్డి జిల్లా బాన్సువాడ కేంద్రంలోని వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో నూతన రక్తనిధి కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.
రక్తనిధి కేంద్రాన్ని ప్రారంభించిన సభాపతి పోచారం
Last Updated : Aug 17, 2019, 11:57 AM IST