కామారెడ్డిలోని విద్యుత్ కార్యాలయం ముందు బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. లాక్డౌన్ సమయంలో విద్యుత్ బిల్లుల్లో అవకతవకలు జరిగాయని భాజపా నేతలు డిమాండ్ చేశారు. కరోనా సమయంలో విధించిన విద్యుత్ బిల్లులో అనేక అవకతవకలు జరిగాయని, ప్రజలు పనులు లేక అనేక ఇబ్బందులు పడుతుంటే.. మూడు నెలల విద్యుత్ బిల్లు ఒకేసారి ప్రజలపై మోపడం సరికాదని భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వెంకట రమణారెడ్డి మండిపడ్డారు.
'పేదలపై విద్యుత్ బిల్లుల రూపంలో పెనుభారం సరికాదు'
లాక్డౌన్ సమయంలో విద్యుత్ బిల్లులు వసూలు చేయడంలో అవకతవకలు జరిగాయని, మూడు నెలల బిల్లు ఒకేసారి వేసి.. ప్రజలపై భారం వేశారని కామారెడ్డి భాజపా నేతలు మండిపడ్డారు. జిల్లా కేంద్రంలోని విద్యుత్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు.
విద్యుత్ బిల్లులు రద్దు చేయాలని భాజపా ధర్నా
మూడు నెలల విద్యుత్ బిల్లులు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లారెడ్డి, జిల్లా అధ్యక్షుడు బాణాల లక్ష్మారెడ్డి, జుక్కల్ మాజీ ఎమ్మెల్యే అరుణతార తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి :కరీంనగర్ కమిషనరేట్లో లైసెన్సు రద్దు సెంచరీ దాటేసింది!