కోప్టాచట్టం పేరుతో బీడీ కార్మికులను రోడ్డున పడేస్తారా అంటూ కేంద్రాన్ని అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య గౌరవ అధ్యక్షురాలు విమలక్క ప్రశ్నించారు. ఈ చట్టం ద్వారా వారికి ఎలాంటి భరోసా కల్పిస్తున్నారని సూటిగా విమర్శించారు. చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డి జిల్లా కలెక్టరేట్ వద్ద ఏఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో మహిళా కార్మికులతో కలిసి ధర్నా నిర్వహించారు.
'కోప్టా చట్టంతో బీడీ కార్మికులను రోడ్డున పడేస్తారా?'
కేంద్రం తీసుకొచ్చిన కోప్టా చట్టానికి వ్యతిరేకంగా బీడీ కార్మికులు ఆందోళన చేపట్టారు. చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ.. కామారెడ్డి జిల్లా కలెక్టరేట్ ధర్నా నిర్వహించారు.
కామారెడ్డి జిల్లా కలెక్టరేట్ వద్ద బీడీ కార్మికులు ఆందోళన
ఈ చట్టంతో 60 లక్షల మంది రోడ్డున పడతారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై కేంద్రం పునరాలోచించాలని లేకుంటే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. అనంతరం కలెక్టర్ కార్యాలయ ఏవోకు వినతిపత్రం అందజేశారు.
ఇదీ చూడండి:తహసీల్దార్ ఎదుట మహిళా రేషన్ డీలర్ ఆత్మహత్యాయత్నం