గద్వాల జిల్లా అలంపూర్లో నిర్వహించనున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు సంబంధించిన గోడపత్రికను ఎమ్మెల్యే అబ్రహం అవిష్కరించారు. శ్రీజోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల 20 నుంచి మహాశివరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి.
మహాశివరాత్రి గోడ పత్రికను ఆవిష్కరించిన ఎమ్మెల్యే అబ్రహం
అష్టాదశ శక్తి పీఠాలలో ఐదో శక్తిపీఠంగా వెలుగొందుతున్న శ్రీ జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో మహశివరాత్రి ఉత్సవాలు ఈనెల 20 నుంచి ప్రారంభం కానున్నాయి. వేడుకలకు సంబంధించిన గోడపత్రికను ఎమ్మెల్యే అబ్రహం చేతులమీదుగా ఆవిష్కరించారు.
మహాశివరాత్రి గోడ పత్రికను ఆవిష్కరించిన ఎమ్మెల్యే అబ్రహం
ఈ సందర్భంగా ఆలయానికి విచ్చేసిన ఎమ్మెల్యే, అలంపూర్ పురపాలిక ఛైర్మన్ మనోరమ స్వామివార్లను దర్శించుకుని... బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రిక, గోడ పత్రికను విడుదల చేశారు.