తెలంగాణ

telangana

ETV Bharat / state

'నకిలీ విత్తనాలు విక్రయిస్తే పీడీ యాక్ట్ నమోదు చేస్తాం' - counterfeit seeds in gadwal district

నకిలీ విత్తవాలను విక్రయించే వారిపై పీడీ యాక్ట్​ నమోదు చేస్తామని జోగులాంబ గద్వాల జిల్లా ఎస్పీ రంజన్ రతన్ కుమార్ అన్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతున్న సందర్భంగా జిల్లాలోని అయిజ పట్టణంలో గల వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఆవరణలో కల్తీ, నాణ్యత లేని విత్తనాల కట్టడిపై డీలర్లకు అవగాహన కల్పించేందుకు సదస్సును నిర్వహించారు.

నకిలీ విత్తనాల నిర్మూలన కోసం డీలర్లకు అవగాహన కల్పించిన పోలీసులు

By

Published : May 31, 2021, 7:04 PM IST

నకిలీ విత్తనాలు అమ్మే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జోగులాంబ గద్వాల జిల్లా ఎస్పీ రంజన్ రతన్ కుమార్ అన్నారు. రైతుల పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని డీలర్లు తమకు సహకరించాలని కోరారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతున్న సందర్భంగా జిల్లాలోని అయిజ పట్టణంలో గల వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఆవరణలో కల్తీ, నాణ్యత లేని విత్తనాల కట్టడిపై డీలర్లకు అవగాహనా సదస్సును ఎస్పీ నిర్వహించారు. నకిలీ విత్తనాలను విక్రయించినా.. లేదా వారికి సహకరించినా పీడీ యాక్ట్ నమోదు చేస్తామని హెచ్చరించారు.

గ్రామాల్లో నకిలీ విత్తనాలను విక్రయించేవారికి గుర్తించేందుకు పటిష్ఠమైన నెట్​వర్క్​​ను ఏర్పాటు చేస్తున్నామని ఎస్పీ రంజన్ రతన్ కుమార్ తెలిపారు. ఈ సందర్బంగా మాట్లాడిన జిల్లా వ్యవసాయ అధికారి గోవింద నాయక్ నకిలీ విత్తనాలను కొని రైతులు మోసపోవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక వ్యవసాయ అధికారులు, పోలీసులు తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: CM KCR: వద్దనుకున్నా లాక్​డౌన్​ తప్పడం లేదు: కేసీఆర్​

ABOUT THE AUTHOR

...view details