జోగులాంబ గద్వాల జిల్లాలోని జూరాల జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఎగువ ప్రాజెక్టుల నుంచి విడుదలైన నీరు ప్రాజెక్టులోకి చేరుతోంది. జూరాలకు లక్ష 7వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండగా.. 10 గేట్లను ఎత్తి 68వేల క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. విద్యుత్ ఉత్పత్తి ద్వారా మరో 42వేల క్యూసెక్కుల నీటిని నదిలోకి వదులుతున్నారు. జూరాల పూర్తి స్థాయి నీటిమట్టం 1045 అడుగులు కాగా.. ప్రస్తుతం 1044 అడుగుల నీటిమట్టం కొనసాగుతోంది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 9.567 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 9.377 టీఎంసీల నీరు ఉంది. నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ ఎత్తిపోతల పథకాలతో పాటు జూరాల కుడి, ఎడమ, సమాంతర కాల్వలకు నీటి విడుదల కొనసాగుతోంది. మొత్తం లక్షా 15వేల క్యూసెక్కుల నీరు బయటకు వెళ్తోంది.
జూరాలకు పోటెత్తుతోన్న వరద
కృష్ణానదికి మళ్లీ వరద పోటెత్తుతోంది. కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల జలాశయాలకు మళ్లీ వరద ప్రవాహం పెరుగుతూ వస్తోంది.
జూరాలకు వరద