జోగులాంబ గద్వాల్ జిల్లా వడ్డేపల్లి మండలం తనగల శివారులో ఉన్న తుమ్మిళ్ల ఎత్తిపోతల పైపులో మృతదేహం లభ్యమైంది. ఎత్తిపోతల పైపు నుంచి దుర్వాసన వస్తుందని పోలీసులకు స్థానికులు సమాచారమిచ్చారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు పైపులో మృతదేహం ఉన్నట్లు గుర్తించారు. క్రేన్ సహాయంతో బయటికి తీసి చూడగా... మృతుడు రాజోలి మండలం పెద్ద తాండ్రపాడుకు చెందిన మేషాక్గా పోలీసులు గుర్తించారు. మంగళవారం రాత్రి తన తోటి గొర్రెల కాపరులకు భోజనం తీసుకొని మేషాక్ వెళ్లాడు. అప్పటి నుంచి కనిపించకుండా పోయాడు. పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. చివరికి పైపులో శవమై తేలాడు. మేషాక్కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. అనుమానస్పద మృతి కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
తుమ్మిళ్ల ఎత్తిపోతల పంపింగ్ పైపులో మృతదేహం...! - గొర్రెల కాపరులకు
నాలుగు రోజుల క్రితం రాత్రి పూట తోటి కాపరులకు భోజనం తీసుకుని గొర్రెల దగ్గరికి వెళ్లాడు. అప్పటి నుంచి కన్పించలేదు. ఎక్కడికి పోయాడో జాడ లేదు. ఎంత వెతికినా ఆచూకీ లేదు. చివరికి తుమ్మిళ్ల ఎత్తిపోతల పైపులో కుళ్లిన శవంగా కన్పించాడు. ప్రమాదవశాత్తు అందులో పడిపోయాడా...? లేక ఎవరైన అతన్ని చంపి అందులో పడేశారా...? లేక ఆత్మహత్య చేసుకున్నాడా...?
DEAD BODY FOUND SUSPICIOUSLY IN THUMMILLA PUMPING PIPE