అనంతపురం వచ్చినా అంబులెన్స్‌ను సరిహద్దులో రాష్ట్ర పోలీసులు అనుమతించకపోవడంపై బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతసేపు బతిమాలిన కూడా వినకపోవడంపై కొవిడ్ బాధితుని కుటుంబసభ్యులు ఆందోళన చెందారు. రాష్ట్రంలోకి అనుమతి లేదంటూ జోగులాంబ గద్వాల జిల్లా పుల్లూరు టోల్ ప్లాజా వద్ద అంబులెన్స్‌ను పోలీసులు నిలిపివేశారు. అనంతరం ఉన్నతాధికారులతో చర్చించిన పోలీసులు చివరికి అనుమతించారు.
సరిహద్దులో పోలీసుల ఆంక్షలు.. బాధితుల విజ్ఞప్తులు..!
ఏపీకి చెందిన కొవిడ్ రోగి అంబులెన్స్‌ను పోలీసులు నిలిపేయడంపై బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో పడక ఉందని చెప్పినా కూడా పంపకపోవడంపై తీవ్ర మనోవేదనకు గురయ్యారు. జోగులాంబ గద్వాల్ జిల్లా పుల్లూరు టోల్ ప్లాజా వద్దే రాష్ట్ర పోలీసులు అంబులెన్స్‌ను నిలిపేశారు. అనంతరం ఉన్నతాధికారులతో చర్చించిన పోలీసులు చివరికి అనుమతించారు.
సరిహద్దులో అంబులెన్స్‌ను అనుమతించిన పోలీసులు
మొదట వినలేదు...
హైదరాబాద్‌లోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో బెడ్ ఉందని చెప్పినా పోలీసులు వినిపించుకోవడం లేదని వాపోయారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న తెలుగు రాష్ట్రాల సీఎంలపై బాధితుని బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతపురంలో సరైన సౌకర్యాలు లేకపోవడంతోనే చికిత్స కోసం హైదరాబాద్ వెళ్తున్నామని పోలీసులను వేడుకున్నారు. చివరకు పోలీసులు ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరిపాక రాష్ట్రంలోకి అనుమతి ఇచ్చారు.
ఇదీ చూడండి:ఏపీ నుంచి వచ్చే కొవిడ్ రోగులను అనుమతించని పోలీసులు
Last Updated : May 10, 2021, 6:10 PM IST