తెలంగాణ

telangana

ETV Bharat / state

ఈ మార్కెటింగ్ దిశగా గద్వాల చేనేత చీరలు

కరోనా కారణంగా చేనేత రంగం ఆరు నెలలుగా తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. చీరలు అమ్ముకునేందుకు అవకాశం లేక మగ్గాలు నేసిన కూలీలు డబ్బులు రాక తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. గుర్తించిన కేంద్ర ప్రభుత్వం చేనేత కార్మికులను ఆదుకునేందుకు ఆ దిశగా చర్యలు ప్రారంభించింది. చేనేత ఉత్పత్తులు అమ్ముకునేందుకు ఈ మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలని నిర్ణయించింది. ఈ మేరకు జిల్లా చేనేత జౌళి శాఖ అధికారులు కార్మికుల నుంచి వివరాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు.

chenetha-sarees-marketing-facility-to-sell-online
'చేనేత చీరలు అమ్ముకునేందుకు ఈ మార్కెటింగ్ సౌకర్యం'

By

Published : Sep 12, 2020, 10:19 PM IST

చేనేత చీరలు అమ్ముకునేందుకు ఇప్పడు కార్మికులు, ఉత్పత్తి దారులకు మంచి అవకాశం లభించింది. జోగులాంబ గద్వాల జిల్లాలో వ్యవసాయం తర్వాత చేనేత రంగంపై ప్రజలు అత్యధికంగా ఆధారపడ్డారు. ఉమ్మడి మహబూబ్​నగర్ జిల్లా పరిధిలో ప్రభుత్వ లెక్కల ప్రకారం 3,473 జియో ట్యాగింగ్ కలిగిన మగ్గాలు ఉన్నాయి. వాటినే నమ్ముకుని 12 వేలకు పైగా కుటుంబాలు జీవనం కొనసాగిస్తున్నాయి. మార్చిలో వచ్చిన కరోనా కారణంగా చేనేత రంగం పూర్తిగా నిలిచిపోయింది. వస్త్ర దుకాణాలు మూతపడ్డాయి. ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు రవాణా సౌకర్యం నిలిచిపోవడం వల్ల.. కార్మికులు తయారుచేసిన పట్టు, కాటన్, సీకో జెర్రీ తదితర కోట్లు విలువచేసే వస్త్రాలు పేరుకుపోయాయి. అన్​లాక్​ పక్రియలో మిగతా రంగాలు మెల్లగా కుదుటపడుతున్నప్పటికీ.. చేనేత రంగం కోలుకోలేదు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కల్పించిన ఈ-మార్కెటింగ్ అవకాశంతో కొంత మేర ఊరట కలుగుతుందని అధికారులు చెబుతున్నారు.

ఉత్పత్తులను అమ్ముకోవచ్చు

కేంద్రం ప్రభుత్వం ఫేస్​జెన్ పేరుతో జీఈఎం.జీవోవీ.ఇన్​ పేరుతో వెబ్​సైట్​ను ఏర్పాటు చేసింది. అందులో వివిధ సంస్థలు నమోదు చేసుకుని తమ ఉత్పత్తులను అమ్ముకోవచ్చు. ప్రభుత్వ సంస్థలు అవసరమైన వస్తువులను ఎక్కువగా ఈ యాప్ ద్వారానే కొనుగోలు చేస్తున్నాయి. అందులో చేనేతకు కూడా అవకాశం కల్పించారు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన చేనేత సర్వీస్ కేంద్రం ఆధ్వర్యంలో ఈ ఏర్పాట్లు చేస్తున్నారు. వివిధ డిజైన్లతో చేసిన చీరలను పొందుపరిస్తే సంస్థలు పెద్ద వస్త్ర దుకాణాలు, వాళ్లతోపాటు ప్రభుత్వం కొనుగోలు చేసే అవకాశం ఉంది.

ఆర్థికంగా ఎదిగేందుకు అవకాశం

జియో ట్యాగింగ్ కలిగిన చేనేత కార్మికులు మాస్టర్​ వేవర్లు అంతా అందులో పేర్లు నమోదు చేసుకోవచ్చు. కార్మికులు, తండ్రి పేరు, ఫోన్​ నంబర్, అడ్రస్​, తయారు చేసే చీరల వివరాలు జిల్లా చేనేత జౌళి శాఖ అధికారులకు సమర్పించాలి. వారు హైదరాబాదులోని చేనేత సర్వీస్ కేంద్రం​కు సిఫార్సు చేస్తారు. అందులో పూర్తి వివరాలు నమోదు చేసి వివరాలు కార్మికుడి చరవాణికి చేరవేస్తారు. ఈ ఆన్​లైన్​ నమోదు ద్వారా కార్మికులకు ఎక్కువగా ఉపయోగం ఉంటుందని జిల్లా చేనేత జౌళిశాఖ ఎడీ చరణ్ తెలిపారు. ఈ మార్కెట్​కు అలవాటు చేసుకుంటే ఆర్థికంగా ఎదిగేందుకు అవకాశం ఉంటుందని ఆయన అన్నారు.

అవగాహన కార్యక్రమాలు

అందులో వివిధ సంస్థలు నమోదు చేసుకుని తమ ఉత్పత్తులను అమ్ముకోవచ్చు. ప్రభుత్వ సంస్థలు అవసరమైన వస్తువులను ఎక్కువగా ఆ యాప్ ద్వారానే కొనుగోలు చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వానికి చెందిన చేనేత సర్వీస్ కేంద్రం ఆధ్వర్యంలో ఈ ఏర్పాట్లు చేస్తున్నారు. చేనేత కార్మికుల కోసం అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఈ మార్కెట్ విధానంలో సహాయ సహకారాలు అందిస్తామని ఏడి చరణ్ తెలిపారు. గద్వాల జిల్లా నుంచి ఇప్పటికే కొందరు కార్మికులు మాస్టర్ వివరాల పేర్లు నమోదు పరిచారని ఆయన వివరించారు.

ఇదీ చూడండి :రేపు యాదాద్రికి సీఎం రాక.. తనిఖీలు చేస్తున్న అధికారులు

ABOUT THE AUTHOR

...view details