దేశ అభివృద్ధే లక్ష్యంగా కేంద్రం బడ్జెట్‌ను ప్రవేశపెట్టిందని భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని రంగాల వారిని ఆదుకునేలా ఉందన్నారు.
'బడ్జెట్ అన్ని రంగాల వారిని ఆదుకునేలా ఉంది' - telangana varthalu
కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని రంగాల వారిని ఆదుకునే విధంగా ఉందని భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. ధనిక దేశాల సరసన భారతదేశాన్ని నిలబెట్టడమే లక్ష్యంగా మోదీ సర్కారు కృషి చేస్తోందన్నారు.
'బడ్జెట్ అన్ని రంగాల వారిని ఆదుకునేలా ఉంది'
దేశ ఆర్థిక పరిస్థితి మెరుగుపరిచే విధంగా బడ్జెట్ ఉందని... కేంద్ర ప్రభుత్వంపై కొంతమంది అనవసరంగా విమర్శలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆమె మండిపడ్డారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు అయ్యే విధంగా బడ్జెట్‌ను రూపొందించారన్నారు. 2030 నాటికి ప్రపంచంలోని ధనిక దేశాల సరసన భారత్‌ను నిలబెట్టేందుకు మోదీ నాయకత్వంలోని సర్కారు కృషి చేస్తోందన్నారు.
ఇదీ చదవండి:రేషన్ కోసం ఇబ్బందులు... ఆధార్ కేంద్రాల వద్ద పడిగాపులు